చేగుంట (తూప్రాన్): కన్న కొడుకును ఓ తండ్రి హత్యచేసి పౌల్ట్రీఫాం ఆవరణలో పూడ్చిపెట్టిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో చోటు చేసుకుంది. సహకార సంఘం చైర్మన్ నారాయణరెడ్డి కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) మేడ్చల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. శ్రావణ్ దసరా పండుగ కోసం శనివారం ఇబ్రహీంపూర్‌కు వచ్చాడు. సోమవారం రాత్రి పౌల్ట్రీఫాంలోని ఇంట్లో శ్రావణ్, నారాయణరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై మద్యం మత్తులో ఉన్న కొడుకును తండ్రి నారాయణరెడ్డి గొంతునులిమి చంపేసి పౌల్ట్రీఫాంలో గొయ్యితీసి పాతిపెట్టాడు.గురువారం మధ్యాహ్నం తనకొడుకు శ్రావణ్‌కుమార్‌రెడ్డిని హత్య చేశానని చేగుంట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ సత్యనారాయణ వద్ద లొంగిపోయాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment