సాక్షి, తిరువణ్ణామలై: డబ్బుల విషయమై జరిగిన ఘర్షణలో రుబ్బురాయితో మోది అక్క, తండ్రిని హత్య చేశాడో యువకుడు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా కళశపాక్కం సమీపంలోని కోవిల్‌మది మంగళం గ్రామానికి చెందిన రామచంద్రన్(65) పోస్టుమన్‌గా చేసి పదవీ విరమణ పొందారు. ఇతనికి కళ్యాణి, చిత్ర అనే ఇద్దరు కుమార్తెలు, శివనేశన్ అనే కుమారుడు ఉన్నారు. కల్యాణికి వివాహమై భర్తను వదిలి తండ్రి ఇంట్లోనే ఉంటోంది. శివనేశన్ గ్రామంలోనే తాత్కాలిక పోస్టుమన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కొద్ది రోజుల క్రితం భార్యతో ఘర్షణపడి వేరుగా జీవిస్తున్నాడు. ఇతను మతిస్థిమితం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివనేశన్ ఖర్చులకు డబ్బులు కావాలని సోమవారం తండ్రిని అడగడంతో ఇద్దరికీ గొడవ జరిగింది. ఆగ్రహించిన శివనేశన్ అక్కడే ఉన్న రుబ్బురాయితో రామచంద్రన్‌పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన అక్క కల్యాణిపై కూడా దాడి చేశాడు. వారి అరుపులు విని స్థానికులు వచ్చి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెంది పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని శివనేశన్‌ను అరెస్టు చేశారు.
రుబ్బురాయితో అక్క, తండ్రిని కడతేర్చాడు
Published Mon, Jan 8 2018 6:41 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment