
సాక్షి, వరంగల్ : నగరంలోని ఆర్టీసీ డిపోలో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు బస్సులు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.