
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. బోరు వేసేందుకు వెళుతున్న బోరు లారీ బోల్తా పడిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం పెద్దతిప్పసముద్రం మండలం కర్ణాటక సరిహద్దుల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చేలూరు మండలం పాల చెరువు వద్ద పొలంలో బోరు వేసేందుకు వెళుతున్న బోరు లారీ.. చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతం వద్ద బోల్తా పడింది. (జ్యువెలరీ షాపులో బంగారు నగలు పక్కదారి)
దీంతో లారీలో ప్రయాణిస్తున్న జయదేవ్, నవదేశ్, రాజారామ్, సుబ్రమణ్యంలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలవ్వటంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ మధ్యప్రదేశ్.. దేచువ గ్రామం,చిత్రంగి తాలూకా, సింగరోలి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment