బాలిక (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: జీతం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు ఓ బాలికను కిరాతకంగా హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ దారుణ ఘటన ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
ఆ వివరాలిలా.. జార్ఖండ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికకు పని కల్పిస్తానని ప్రధాన నిందితుడు మంజీత్ కర్కెటా నమ్మించాడు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట ఢిల్లీకి తీసుకెళ్లి ఓ ఇంట్లో పనికి కుదరిచ్చాడు. రెండేళ్లు బాగానే గడిచింది. ఆపై బాలికకు కష్టాలు మొదలయ్యాయి. జీతం డబ్బులను మంజీత్ తీసుకుని బాధితురాలికి ఇచ్చేవాడు కాదు. ఏడాదిగా జీతం డబ్బులు రాకపోవడంతో ఈ మే3న స్వగ్రామంలోని మంజీత్ ఇంటికి వెళ్లి నిలదీసింది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ మరో ఇద్దరి సాయంతో బాలికను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి డ్రైనేజీలో పడేయగా మే4న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పక్క అపార్ట్‌మెంట్లో ఉండే మంజీత్ బాలిక హత్య జరిగినప్పటి నుంచీ అదృశ్యమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో మే17న ఢిల్లీలోని అద్దె ఇంటికి మంజీత్ వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. ఆదివారం ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. జీతం డబ్బులు అడిగినందుకే ఓ మహిళ సహా ఇద్దరి సాయంతో బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment