స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు
డి.హిరేహాళ్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని ఆమె భర్త దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన సోమలాపురంలో జరిగింది. గ్రామంలోని ఓ మహిళ తన భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో రామాంజనేయులు అనే యువకుడిని పిలిపించుకుని వివాహేతర సంబంధం కొనసాగించేది.
భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన ఆ భర్త గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్నట్లుగా నటించాడు. నిజంగా మత్తులో ఉన్నాడనుకున్న భార్య యథా ప్రకారం ఆ యువకుడిని పిలిపించుకుంది. ఇంట్లోకి రాగానే రామాంజనేయులును ఆమె భర్త పట్టుకుని, విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment