వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ తన్నీరు గోవర్థన్
బాలానగర్: కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం బాలానగర్ ఏసీపీ తన్నీరు గోవర్థన్ వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లాకు చెందిన పెద్దింటి జగదీశ్వర్‌రావు గాంధీ నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన చీమ వీరబాబుతో జగదీశ్వర్ రావు బార్య తులసికి వివాహేతర సంబంధం కొససాగిస్తోంది. ఈ విషయమై భర్త ఆమెను హెచ్చరించడంతో తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన తులసి, వీరబాబు గత నెల 24న జగదీశ్వర్‌రావు మెడకు చున్నీతో బిగించి హత్య చేశారు.
అనంతరం వీరబాబు పరారుకాగా తులసి హడావుడిగా భర్తను బాలానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిం తన భర్తకు గుండెపోటు వచ్చిందని చెప్పింది. అయితే ఆమె మాటలు, చేతలకు పొంతన లేక పోవటంతో బాలానగర్ సీఐ కిషన్‌కుమార్ ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో నిందితులు వీరబాబు, తులసిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సైలు రవికిరణ్, వీరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment