
అన్నానగర్: కుటుంబ తగాదాలో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కన్నగి నగర్‌లో ఆది వారం జరిగింది. చెన్నై సమీపం కన్నగి నగర్‌కు చెందిన వెంకటేషన్ (37). ఇతనికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉండడంతో భార్య,భర్తల మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఆదివారం సాయంత్రం అతని భార్య పిల్లలను పిలుచుకుని అదే ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపం చెందిన వెంకటేషన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో కన్నగినగర్ పోలీసులు వెంకటేషన్ మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది