Venkateshan
-
దంపతుల ఘర్షణ.. భర్త ఆత్మహత్య
అన్నానగర్: కుటుంబ తగాదాలో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కన్నగి నగర్లో ఆది వారం జరిగింది. చెన్నై సమీపం కన్నగి నగర్‌కు చెందిన వెంకటేషన్ (37). ఇతనికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉండడంతో భార్య,భర్తల మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఆదివారం సాయంత్రం అతని భార్య పిల్లలను పిలుచుకుని అదే ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపం చెందిన వెంకటేషన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో కన్నగినగర్ పోలీసులు వెంకటేషన్ మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది -
కాల్టాక్సీతో జాగ్రత్త
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రమాదం ముంచుకొచ్చి బాధితులుగా మిగలక ముందే కాల్టాక్సీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీస్‌శాఖ సూచిస్తోంది. కాల్‌టాక్సీ యాజమాన్యాలు కొన్ని కట్టుబాట్లను పాటించకుంటే కటకటాలు తప్పవని హెచ్చరిస్తోంది. చె న్నై నగరవాసులు కాల్టాక్సీని వినియోగించడం సహజంగా మారింది. కాల్టాక్సీలపై ఆధారపడకుండా రోజు గడవడం అధికశాతం మందికి కష్టంగా మారింది. అందునా మహిళలు పెద్ద సంఖ్యలో కాల్టాక్సీని వినియోగిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కాల్టాక్సీల డ్రైవర్లు మహిళా ప్యాసింజర్లతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, కిడ్నాప్‌లకు కూడా వెనుకాడక పోవడం పెచ్చుమీరి పోయింది. కాల్టాక్సీలో ప్రయాణించే మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోవడం పోలీస్‌శాఖ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పారాహుషార్ కాల్‌టాక్సీ వినియోగదారులు, యాజమాన్యాలు సైతం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ పోలీస్‌శాఖ కొత్తగా కొన్ని కట్టుబాట్లను విధించింది. కాల్‌టాక్సీ యాజమాన్యాలు డ్రైవర్, ఇతర విధులకు సిబ్బందిని నియమించే ముందు పోలీస్‌శాఖ నుంచి సచ్చీలురుగా కచ్చితంగా సర్టిఫికెట్ పొందాలి. డ్రైవర్ తాత్కాలిక, శాశ్వత గృహ చిరునామాను సేకరించి పెట్టుకోవాలి. అన్ని వాహనాల్లో జీపీఎస్ పరికరాన్ని అమర్చాలి. ఈ జీపీఎస్ సక్రమంగా పనిచేస్తోందా అని తరచూ తనిఖీలు చేసుకోవాలి. కాంట్రాక్టుపై వాహనాలు తీసుకునే ముందు వాటి నాణ్యత, యజమాని పేరు, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఒప్పందం కుదుర్చుకుని ప్రజా సేవలకు వినియోగించాలి. ప్రయాణికులకు బాగా కనిపించేలే పానిక్ బటన్‌ను అమర్చడంతోపాటూ వాటిని ఎలా వినియోగించాలో తెలియజెప్పాలి. డ్రైవర్లకు ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులను జారీచేయాలి. విధుల్లో ఉన్నపుడు డ్రైవర్లు గుర్తింపు కార్డులను ధరించాలి. ప్రయాణికులు గుర్తింపులేని, నిబంధనలు పాటించని కాల్టాక్సీలను వినియోగించరాదు. కాల్‌టాక్సీ యాజమాన్యాలు ప్రతినెలా సమావేశమై డ్రైవర్లు పనితీరును సమీక్షించుకుకోవాలి. ప్రయాణికుల, ముఖ్యంగా మహిళల రక్షణ కోసం విధించిన ఈ నిబంధనలను పాటించని కాల్‌టాక్సీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని పోలీస్‌శాఖ హెచ్చరిస్తోంది. -
దద్దరిల్లిన సభ
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడివేడిగా సాగాయి. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, అరుపులు, కేకలతో అసెంబ్లీ దద్దరిల్లి పోయింది. మంత్రి వైద్యలింగం మాటలు పెద్ద దుమారం రేపాయి. తమను అవమానానికి గురిచేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడివేడిగా జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే తన రాజకీయ గురువు, విజేతలకు విజేతైన కెప్టెన్‌కు నమస్కరిస్తూ డీఎండీకే సభ్యులు వెంకటేశన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇందుకు మంత్రి వైద్యలింగం అడ్డుతగిలారు. ఎక్కడ విజేత, గత పార్లమెంటు ఎన్నికల్లోనా, మూడో స్థానానికి దిగజారడంలోనా, డిపాజిట్ కోల్పోవడంలోనా.. అంటూ చురకలు అంటించారు. ఆగ్రహించిన వెంకటేశన్ మంత్రి వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే సభలోనే ఉన్న సీఎం జయలలిత, స్పీకర్ పట్టించుకోకపోవడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగా పోటీచేసే దమ్ముందా అంటూ మంత్రి సవాల్ విసిరారు. ఒంటరిపోరుతో మీకు కనీసం వెయ్యి ఓట్లు కూడా రావు అంటూ ఎద్దేవా చేశారు. సవాల్‌కు బదులివ్వకుండా ఇతర వాటిపై దృష్టి సారించారంటూ మంత్రి పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. ఎంజీ రామచంద్రన్ మినహా ఎవ్వరూ ఈ రాష్ట్రాన్ని వరుసగా పాలించలేదని, ఈ విషయం గుర్తించుకోండి అంటూ ఆయన బదులిచ్చారు. మౌళివాక్కం ప్రమాదంపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశామని, ఈ రోజైనా ఇవ్వాలని డీఎండీకే సభ్యులు దురైమురుగన్ కోరారు. ప్రమాదంతో సీఎండీఏకు సంబంధం లేదని మంత్రి ప్రకటించారు. అంతమాత్రానికి సీఎండీఏకు ఒక మంత్రి ఎందుకని దురైమురుగన్ నిలదీశారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ నిరాకరించడంతో ప్రతిపక్షాలతో కలిసి వాకౌట్కు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మంత్రి వైద్యలింగం ఁలేచి పోయే అలవాటు ఉన్నవారు లేచిపోతున్నారు* అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల పట్ల అవమానకరంగా మాట్లాడుతున్నా సభలోనే ఉన్న సీఎం మందలించాల్సింది పోయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారని, స్పీకర్ సైతం ఆ మాటలను తొలగించేందుకు వీలులేదని స్పష్టం చేశారని వాకౌట్ చేసిన అనంతరం మీడియా వద్ద ప్రతిపక్షాలు వాపోయాయి. నిషేధిత రోజుల్లో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇచ్చే ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఇతర మత్య్సకారులకు సైతం వర్తింపజేయాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే రవి కోరారు. మంత్రి జయపాల్ ఇందుకు సమాధానం ఇస్తూ రిజర్వాయర్లు, నదుల్లో చేపలుపట్టేవారికి వేరే ఉద్యోగాలు ఉన్నందున సహాయం కుదరదని స్పష్టం చేశారు. -
తాగునీటి కోసం ఆందోళన
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: తాగునీటి కోసం మహిళలు నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘటన శుక్రవారం జరిగింది. చోళవరం యూనియాన్‌లోని ఆరణి నగర పంచాయతీ ఉంది. పంచాయతీ పరిధిలోని 3వ వార్డు పెరుమాళ్ కుప్పంలో 200 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి ప్రత్యేక పంపుసెట్ లేదు. అందువల్ల ఆరణి మోటార్ నుంచే నేరుగా పైపులైన్ ద్యారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. అయితే నెల రోజుల నుంచి ఈ గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ ఈవోకి గ్రామస్తులు విన్నవించారు. కానీ స్పందన లేదు. మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా నీళ్లు సరఫరా చేయాలని గ్రామస్తు లు అధికారులకు ముందుగా విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగ్రహించిన మహిళలు శుక్రవారం ఉదయం ఖాళీ బిందెలతో ఆరణి నగర పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్యారం వద్ద బైఠాయించారు. నెల రోజులు నుంచి తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉదయం 10.45 గంటల నుంచి రెండు గంటలపాటు ధర్నా చేసివా ఈవో సంఘటన స్థలానికి రాలేదు. కార్యాలయంలో ఉన్న పంచాయతీ అధ్యక్షుడు వెంకటేశన్‌తో గ్రామ మహిళలు వాగ్వివాదానికి దిగా రు.విషయం తెలుసుకున్న ఆరణి ఎస్ఐలు సుబ్రమణి, పరంధామన్ వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. పోలీసుల ఫోన్‌తో వచ్చిన ఈవో ఈ రోజు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాడు. గ్రామస్తులు రెండురోజుల్లో నీరు ఇవ్వక పోతే పెరియపాలెం రోడ్డుపై ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.