![Husband Cousin Molested Woman on Multiple Occasions In Gurugram - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/29/crime.jpg.webp?itok=2DABLpJ1)
గురుగ్రామ్ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. బంధుత్వాన్ని మరచి తమ్ముడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన గురుగ్రామ్ నగరంలోని బజ్గేరా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజ్గేరా గ్రామానికి చెందిన ఓ వ్యాపారి భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతని ఇంటి సమీపంలోనే వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తరచూ తమ్ముడి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో తమ్ముడి భార్యపై కన్నేశాడు.
వ్యాపారం రీత్యా తమ్ముడు ప్రతి రోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వాడు. ఇదే అదునుగా భావించిన అన్నయ్య.. ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలు దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. తన పిల్లలకు, భర్తకు ఎక్కడ హాని తలపెడుతాడో అనే భయంతో ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. అయితే ఇటీవల అతని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేది ఏమిలేక గత శుక్రవారం ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పారు. దీంతో ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment