![Husband Missing Case Reveals Tamil nadu Police - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/21/missing.jpg.webp?itok=1fE-z6q7)
చెన్నై,తిరువొత్తియూరు: రామనాథపురం జిల్లాలో అదృశ్యమైన వ్యక్తి బావిలో ఎముకల గూడుగా కనిపించారు. రామనాథపురం, కముది మండల మాణిక్యం సమీపం వల్లండైకి చెందిన వ్యక్తి తిరుజ్నానం (60). అతని భార్య ముత్తురాక్క. ఈ క్రమంలో తిరుజ్ఞానం తరచూ గొడవ పడి ఇంటి నుంచి కోపించుకుని వెళ్లిపోయేవారని తెలిసింది. తరువాత రెండు నెలల తరువాత ఇంటికి వచ్చే వారని సమాచారం. ఈ క్రమంలో గత 9 నెలలకు ముందు ఇంటి నుండి వెళ్లిపోయిన తిరుజ్ఞానం తర్వాత తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో ఆందోళన చెందిన ముత్తురాక్క భర్త కోసం అన్ని చోట్ల గాలించారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో భర్త కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం వల్లలాంలో ఊరికి చివరగా ఉన్న ఓ బావిలో చేతిలో సెల్‌ఫోన్‌లో ఎముకల గూడు ఒకటి బావిలో పడి వుండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎముకల గూడుని పైకి తీసి సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ చేయగా అది అదృశ్యమైన తిరుజ్ఞానం మృతదేహమని తెలిసింది. దీంతో పోలీసులు ఎముకల గూటిని ఫోరెన్సిక్ పరిశోధనకు పంపి దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment