
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని బీసీ రోడ్డు నేతాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నిత్యం భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తి.. ఏకంగా పెట్రోల్ పోసి.. భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. దుర్గారావు అనే వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ తీసుకొచ్చి.. భార్యాపిల్లలపై చల్లబోయాడు. వారిని తగులపెట్టేందుకు ప్రయత్నించాడు. వారు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అతన్ని అడ్డుకున్నారు. దీంతో సదరు శాడిస్ట్ భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. గాజవాక పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాధితురాలి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. తన భర్త నిత్యం వేధిస్తున్నాడని, అతడి నుంచి ప్రాణహాని ఉందని, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదని, వాడి నుంచి మీరే కాపాడాలని బాధితురాలి చిన్నీ కన్నీరుమున్నీరవుతూ పోలీసులను వేడుకున్నారు. నిందితుడిని జైల్లో పెట్టి.. మీకు రక్షణ కల్పించే బాధ్యత మాదని పోలీసులు ఆమెను సముదాయించారు.
Comments
Please login to add a commentAdd a comment