
బంజారాహిల్స్:అనుమానాస్పద స్థితిలో జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని మంగా టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న హృదయ లాడ్జిలో అర్జున్‌గౌడ్(30) అనే యువకుడు 20 రోజులుగా ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకొని వచ్చిన అతను కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు.
అక్కడే ఉన్న అతని స్నేహితుడు నాగకార్తీక్ అనే వివరాలు అడగగా దగ్గు వస్తున్నందున ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్లు చెప్పాడు. సోమవారం ఉదయం అర్జున్‌గౌడ్‌ను లేసేందుకు ప్రయత్నించగా చలనం లేకపోవడంతో 108కు సమాచారం అందించారు. పరీక్షించిన సిబ్బంది అతను మృతి చెందినట్లు తెలిపారు. నాగకార్తీక్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్జున్‌గౌడ్ వేసుకున్న మాత్రల వివరాలపై ఆరా తీస్తున్నారు. అర్జున్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక అనారోగ్యం మృతి చెందాడా అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment