భర్తకు మైనర్‌ బాలికతో వివాహం | Karnataka Man Rapes Minor Girl | Sakshi
Sakshi News home page

భర్తకు మైనర్‌ బాలికతో వివాహం

Mar 13 2019 10:46 AM | Updated on Mar 13 2019 5:15 PM

Karnataka Man Rapes Minor Girl - Sakshi

కీచక భర్తకు మైనర్‌ బాలికతో వివాహం జరిపించిన భార్య

బెంగళూర్‌ : తన ఇంట్లో ఆశ్రయం పొందిన మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పెయింటర్‌ ఉదంతం వెలుగుచూసింది. లైంగిక దాడికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో నిందితుడి భార్య బాలికతో ఆయనకు బలవంతంగా వివాహం జరిపించింది. కోలార్‌ జిల్లా మలూర్‌ తాలూకా హునసికోట్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

పెయింటింగ్‌ పనులకు వెళ్లే గంగరాజు (32) భర్తను వదిలివేసిన పల్లవి కొద్దినెలల కిందట పెళ్లి చేసుకుని హునసికోట్‌లో ఉంటున్నారు. గత వారం పల్లవికి వరుసకు సోదరి అయ్యే 13 ఏళ్ల బాలిక వారి ఇంటికి వచ్చి వారితో కలిసి ఉంటోంది. మైనర్‌ బాలికపై కన్నేసిన గంగరాజు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు.

అయితే గ్రామంలో ఈ విషయం తెలియడంతో మలూర్‌లోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందింది. బాలికను పోలీసులు ప్రశ్నించగా భయంతో అలాంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పింది. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు మరో ఫిర్యాదు అందడంతో కౌన్సెలర్‌, లీగల్‌ అడ్వైజర్‌తో కలిసివచ్చిన పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు రాబట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదుపై గంగరాజు, పల్లవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement