
చిత్తూరు , తిరుపతి లీగల్ : తిరుపతి అంబేడ్కర్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న చెన్నైకి చెందిన ఓ విద్యార్థినిని వేధించిన కేసులో అదే కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన ముచ్చకాయల నారాయణకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి రెండవ అదనపు జూనియర్‌జడ్జి సన్యాసినాయుడు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు తిరుపతి రూరల్ కాలూరుకు చెందిన నారాయణ కొన్నాళ్లు తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తర్వాత అంబేడ్కర్ న్యాయ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. అదే కళాశాలలో చదివే చెన్నైకి చెందిన విద్యార్థినిని ప్రేమించాలంటూ వేధించాడు.
దీనికి ఆమె అంగీకరించక ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కళాశాల యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో యాజమాన్యం ఈ ఏడాది మార్చిలో అతన్ని విధుల నుంచి తొలగించింది. కోపంతో అతను ఆమె ఫొటోను సామాజిక మాధ్యమాల్లో కాల్‌గర్ల్ పేరుతో పోస్టు చేశారు. ఇప్పటికైనా తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆ విద్యార్థిని ఈస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు పంపిన మెసేజ్‌లను సేకరించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. దీంతో ఈనెల 24వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment