లండన్: అబ్బాయిలా వేషం మార్చి అకృత్యాలకు పాల్పడిందో మహిళ. దాదాపు యాభై మంది బాలికలపై లైంగిక దాడి చేసి.. కటకటాలపాలైంది. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు ఆమెకు శనివారం శిక్షను ఖరారు చేయనుంది. వివరాలు.... గెమ్మా వాట్స్(21) అనే మహిళ తన తల్లితో కలిసి ఉత్తర లండన్‌లో నివసించేది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గెమ్మా.. అబ్బాయి పేరిట ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ తదితర యాప్‌లలో ఖాతాలు తెరిచింది.
16 ఏళ్ల అబ్బాయినని చెప్పుకొంటూ 14, 15 ఏళ్ల వయస్సున్న బాలికలతో చాటింగ్ చేసేది. అబ్బాయిలా వేషం మార్చి.. తన మాటలతో మభ్యపెట్టి వారిని నేరుగా కలుస్తానంటూ ఒత్తిడి తీసుకువచ్చేది. ఇక గెమ్మా రూపానికి ఆకర్షితులైన సదరు బాలికలు ఆమెను కలిసేందుకు ఆసక్తి చూపేవారు. ఈ క్రమంలో ఒకటి రెండుసార్లు వారిని ప్రత్యక్షంగా కలిసిన తర్వాత.. గెమ్మా వారిపై అత్యాచారానికి పాల్పడేది. ఇలా దేశవ్యాప్తంగా సంచరిస్తూ దాదాపు 50 మంది మైనర్లపై ఆమె లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 2018లో గెమ్మాను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలికలతో పాటు ఓ బాలుడిపై కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన విచారణాధికారి మాట్లాడుతూ.. గెమ్మా గతంలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రాణించిందని తెలిపారు. అయితే ఈ దారుణాలకు ఒడిగట్టినందుకు తాను ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. బేస్‌బాల్ క్యాపుతో జట్టును దాచి.. అబ్బాయిలా వేషం ధరించి బాలికల పట్ల తన క్రూర వాంఛను తీర్చుకునేదని.. గెమ్మా వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పలు వాయిదాల అనంతరం కోర్టు ఆమెకు శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా తాను నలుగురిపై మాత్రమే దాష్టీకానికి పాల్పడినట్లు అంగీకరించిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment