ధర్నా చేస్తున్న అన్భరసి
అన్నానగర్ : కళ్లకురిచ్చి సమీపంలో వివాహం చేసుకోవడానికి వ్యతిరేక తెలిపిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టడంతో స్థానికంగా కలకలం ఏర్పడింది. కళ్లకుర్చి జిల్లా తిరుకోవిల్ సమీపం వసంత కృష్ణాపురానికి చెందిన పన్నీర్ సెల్వం కుమార్తె అన్భరసి. ఈమె చెన్నై లో ఉంటూ పనిచేస్తూ వచ్చింది. ఈమె అదే ప్రాంతానికి చెందిన మారిముత్తు కుమారుడు విశ్వనాథన్‌ను ప్రేమించింది. వీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
మూడు నెలలగా తనను వివాహం చేసుకోమని విశ్వనాథన్‌ను ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కానీ అతను వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. దీనిపై 20 రోజులకు ముందు విల్లుపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బుధవారం అదే ప్రాంతంలో ఉన్న తన ప్రియుడు విశ్వనాథన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రియుడు ఎక్కడ..? అని రాసిన పలకను చేతిలో పెట్టుకుని ధర్నాలో నిమగ్నమయ్యింది. ప్రియుడితో పెళ్లిజరిపించాలని కోరింది. దీనిపై సమాచారం అందుకున్న అరకొండనల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్భరసి, ఆమె బంధువులతో మాట్లాడారు. ప్రియుడిని కలిపే విధంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. అనంతరం ప్రియురాలు, ఆమె బంధువులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment