![Major General Held Guilty Of Sexually Abusing Woman Officer - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/24/crime.jpg.webp?itok=SqpXZmtX)
న్యూఢిల్లీ : మహిళా అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన మేజర్ జనరల్ ఎంఎస్ జస్వాల్‌ను ఆర్మీ జనరల్ కోర్టు మార్షల్ (జీసీఎం) సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్వాల్ రెండేళ్ల కిందట నాగాలాండ్‌లో పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా కొహిమాలో పనిచేస్తున్న సమయంలో కెప్టెన్ ర్యాంక్ అధికారి అయిన మహిళను తన రూమ్‌కు పిలిపించుకుని అసభ్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించారు.
అయితే సైన్యంలో వర్గ పోరును తనను బలిపశువును చేశారని, తాను అమాయకుడినని నిందితుడు చెప్పుకొచ్చారు. మేజర్ జనరల్‌పై ఈ ఏడాది జూన్ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా జీసీఎం తీర్పుపై మేజర్ జనరల్ ఎగువ కోర్టులో అప్పీల్‌కు వెళతారని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment