నేరేడ్మెట్: పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి వివరాలు వెల్లడించారు. నేరేడ్మెట్కు చెందిన యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. పదేళ్ల క్రితం ఆమెకు ఓల్డ్ సఫిల్‌గూడకు చెందిన శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరుచూ వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. 2016లో పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్ ప్రతిపాదించగా ఆమె అంగీకరించింది. అప్పటి నుంచి ఆమె జీతం డబ్బులను శ్రీకాంత్ తీసుకునే వాడు. మూడేళ్లుగా కలిసి తిరుగుతున్నారు. ఏడాది క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు యువతి ఇంటికి వచ్చిన అతను ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా యువతి ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోగా తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment