పబ్‌జీ కోసం.. బావపై కత్తితో దాడి! | Man Attacked Sisters Would Be For PUBG Game | Sakshi
Sakshi News home page

పబ్‌జీ కోసం.. బావపై కత్తితో దాడి!

Published Sun, Feb 17 2019 10:14 AM | Last Updated on Sun, Feb 17 2019 10:14 AM

Man Attacked Sisters Would Be For PUBG Game - Sakshi

చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ తన మాయలో పడేసుకుంటోంది పబ్‌జీ. ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ ఉచ్చులో పడి తిండి తిప్పలు కూడా మానేస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటూ ఉంటున్నారు. పిల్లలు దీని బారిన పడి స్కూల్లో కూడా పాఠాలు వినకుండా గేమ్‌ ఆడుకుంటున్నారంటే దీని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. పబ్‌జీ ఆడుతూ.. జనాలు పిచ్చి వారు కూడా అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పబ్‌జీ ఆడుతూ.. ఫోన్‌లో చార్జీంగ్‌ అయిపోయిందని ఇంట్లో నానా హంగామా చేశాడు. 

థానేకు చెందిన రజనీష్‌ రాజ్‌భర్‌ పబ్‌జీ ఆడుతూ ఉండగా.. మధ్యలో చార్జింగ్‌ అయిపోయింది. ఇంట్లో చార్జర్‌ కనబడకపోయే సరికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంట్లో గొడవ చేస్తుండగా.. అడ్డువచ్చిన అక్క భర్తపై కత్తితో దాడి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గేమ్‌ను భారత దేశంలో నిషేధించాలని అన్ని వైపులనుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పబ్‌జీని నిషేధించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement