
ప్రతీకాత్మక చిత్రం
శాంతినగర్ (అలంపూర్) : త్వరగా అన్నం పెట్టలేదని భార్యతో గొడవపడ్డాడు ఆ యువకుడు. మద్యం మత్తులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాలిలా.. అదే గ్రామానికి చెందిన కుర్వ సోమశేఖర్ (24) వృత్తి రీత్యా ట్రాక్టర్ డ్రైవర్. ఈ మద్య తాగుడకు బానిసయ్యాడు. సోమ వారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మద్యం తాగి ఇంటికి వచ్చాడు.
భోజనం పెట్టమని భార్యను అడిగాడు. బాబు ఏడుస్తున్నాడు.. కాస్త ఆగని ఓదార్చిన తర్వాత ఆలస్యంగా వచ్చింది. అంతే మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాక బయటికి వెళ్లిన సోమశేఖర్ పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తుండగానే చనిపోయాడు. తండ్రి కుర్వ నాగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ తెలిపారు. ఇదిలాఉండగా మృతునికి భార్య శిరీషతోపాటు ఓ కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment