
ప్రతీకాత్మకచిత్రం
ఆవులపై ఘోరం : ప్రబుద్ధుడి అరెస్ట్
లక్నో : అయోధ్యలోని గోశాలలో ఆవుతో లైంగిక చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్తాలియా బాబా ఆశ్రమ్ నిర్వహిస్తున్న ఈ గోశాలలో ఈ ఘాతుకానికి పాల్పడుతూ నిందితుడు రాజ్‌కుమార్ వాలంటీర్లకు పట్టుబడ్డాడు. గోశాలలోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు పలు ఆవులపై లైంగిక దాడులకు పాల్పడటాన్ని గమనించిన వాలంటీర్లు అతనిపై నిఘా ఉంచి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడిని పోలీసులకు అప్పగించే ముందు వాలంటీర్లు చితకబాదారు. జంతువులపై క్రూరంగా వ్యవహరించినందుకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అయోధ్య ఎస్పీ జోగేంద్ర కుమార్ తెలిపారు. ఏడు ఆవులపై వరుసగా నిందితుడు అనాగరిక చర్యకు తెగబడినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైందని గోశాల నిర్వాహకులు రాందాస్ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నానో తనకు తెలియలేదని, తనను పట్టుకున్న ప్రజలు, పోలీసులు తనను తీవ్రంగా కొట్టడం మినహా తనకు ఏమీ గుర్తులేదని నిందితుడు రాజ్‌కుమార్ చెప్పుకొచ్చాడు.