
హొసూరు: సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన యువకుడితో ఆ యువతి ప్రేమలో మునిగిపోయింది. పెళ్లి చేసుకుంటానని బాసలు చేయడంతో అతన్ని పూర్తిగా నమ్మింది. ఈక్రమంలో ప్రియుడు మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని కోరడతో పత్తా లేకుండా పోయాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. జిల్లా కేంద్రం క్రిష్ణగిరికి చెందిన 27 ఏళ్ల యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని విడుకంపాళ్యం గ్రామానికి చెందిన బాలన్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమేర్పడింది. అప్పటినుంచి వారి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుపర్యాయాలు కోయంబత్తూరుకు పిలిపించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు.
తనను పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో బాలన్ నుంచి సమాధానం స్పందన కొరవడింది. ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు క్రిష్ణగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితురాలు పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రిష్ణగిరికి వెళ్లాలని సమాధానం ఇచ్చారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మహిళ ఈనెల 28వ తేదీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి ప్రియుడు బాలన్ కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment