వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
కూసుమంచి: ఇదొక ఘరానా మోసం. సూర్యాపేట నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఓ లారీ వెళుతోంది. మండలంలోని జీళ్లచెరువు సమీపంలో దీనిని మంగâ¶వారం సాయంత్రం ఓ ఆగంతకుడు మోటార్ సైకిల్‌పై వచ్చి అడ్డగించాడు. ‘‘నేను కానిస్టేబుల్‌ని. యాక్సిడెంట్ చేసి తప్పించుకుని తిరిగొస్తున్నావా..? కాగితాలు చూపించు’’ అని డ్రైవర్ రోంపాక బాబాయ్‌ను బెదిరించాడు.
పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ బైక్‌పై ఎక్కించుకున్నాడు. నేలకొండపల్లి రహదారి వైపు తీసుకెళ్లాడు. నేలకొండనల్లి మండలం రాజేశ్వరపురం కాలువ సమీపంలో అతడిని కొట్టాడు. అతని వద్దనున్న రూ.30వేలు తీసుకుని, ఆ డ్రైవర్‌ను అక్కడే వదిలేసి బైక్‌పై పరారయ్యాడు. ఆ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ వసంత్‌కుమార్, ఎస్‌ఐ రఘు కేసు నమోదు చేశారు.
ఆగంతకుడి కోసం గాలింపు చేపట్టారు. కూసుమంచిలో ఏఎస్‌ఐ రవూఫ్ ఆద్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మండలంలో వారం కిందట ఇలాంటి ఘటనే జరిగింది. ఇది రెండోది.
Comments
Please login to add a commentAdd a comment