కుటుంబ సభ్యులను చంపి.. తానూ కాల్చుకున్నాడు | Man Shoots Family Members And Kills Himself In Mysore | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులను చంపి.. తానూ కాల్చుకున్నాడు

Aug 16 2019 12:53 PM | Updated on Aug 16 2019 1:08 PM

Man Shoots Family Members And Kills Himself In Mysore - Sakshi

సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. మైసూరుకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను చంపి ఆపై తనను తాను కాల్చుకున్నాడు. ఈ విషాదకర ఘటన మైసూరులోని గుండ్లుపేట్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. 

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరుకు చెందిన ఓం ప్రకాశ్‌ భట్టాచార్య(38) బిజినెస్‌మెన్‌. వ్యాపారంలో ఆర్థికంగా నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. తాను చనిపోతే కుటుంబసభ్యులు దిక్కులేని వాళ్లవుతారని భావించి వాళ్లని చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓం ప్రకాశ్‌ గురువారం తన కుటుంబ సభ్యులను తీసుకొని మైసూరు సమీపంలోని గుండ్లుపేట్‌లో ఉన్న తన స్నేహితుడు ఫాంహౌజ్‌కు వచ్చాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో తొలుత తండ్రి నాగరాజ భట్టాచార్య(65), తల్లి హేమ(60), భార్య నిఖిత(30), కొడుకు ఆర్యకృష్ణ(4)లను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వివరాలను  చమ్‌రాజ్‌నగర్‌ ఎస్పీ హెచ్‌డి ఆనంద్‌కుమార్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement