సాక్షి, గుంటూరు : తాడేపల్లి పోలీసు స్టేషన్ వద్ద ఆదివారం కలకలం చోటుచేసుకుంది. వెంకటేష్ అనే యువకుడు ఒంటి మీద పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని ప్రయత్నాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. తాను సాంబశివరావు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నానని, అందుకు బదులుగా రూ. 23 లక్షలు అతను వసూలు చేశాడని, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెంకటేశ్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు అతను చెప్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment