ప్రతీకాత్మక చిత్రం
రాయ్‌పూర్ : దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. అరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల రేవలి గ్రామంలో ఆదివారం ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు ఎస్‌ఐ కాగా, మరొకరు స్కూల్ టీచర్. దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా వివరాల ప్రకారం.. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్‌ను సీఆర్పీఎఫ్ బెటాలియన్‌తో సమన్వయం చేస్తూ అరన్‌పూర్‌కు బదిలీ చేశారు. అక్కడే ఉన్న తన మిత్రుడు జైసింగ్ కురేటిని కలిసేందుకు కశ్యప్ వెళ్లాడు. సమాచారం అందుకున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆ గ్రామంలోకి చొరబడ్డారు.
కశ్యప్, జైసింగ్‌లను కిడ్నాప్ చేశారు. వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా కూంబింగ్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సున్నిత ప్రాంతమైన రేవలి, అరన్‌పూర్ గ్రామాలు రాయపూర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాగా, మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన ఇద్దరిలో ఎస్‌ఐ లలిత్ కశ్యప్‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్‌ఐని హత్య చేసిన మావోయిస్టులు అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలివెళ్లారు. స్కూల్ టీచర్ మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment