‘బిడ్డా.. మేం ప్రతీకారం తీర్చుకుంటాం’ | Minor Raped In Bhopal Sadhvi Pragya Fires On Kamalnath Govt Says We will TakeRevenge | Sakshi
Sakshi News home page

దారుణం: చంపి.. తలను బండలతో ఛిద్రం చేసి

Published Thu, May 2 2019 12:08 PM | Last Updated on Thu, May 2 2019 12:10 PM

Minor Raped In Bhopal Sadhvi Pragya Fires On Kamalnath Govt Says We will TakeRevenge - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు ఆమెను హత్యచేశారు. అనంతరం ఆనవాలు దొరకకుండా ఉండేందుకు తలపై బండరాళ్లతో మోదారు. ఈ దుర్ఘటన మంగళవారం భోపాల్‌లో చోటుచేసుకుంది. ఆరోజు సాయంత్రం తన పిన్ని(16)తో కలిసి బాధితురాలు గుడికి వెళ్లిన సమయంలో నిందితులు ఆమెను అపహరించారని పోలీసులు తెలిపారు. వారు బాధితురాలి పిన్ని ఇంటి పక్కనే ఉంటారని.. దీంతో నిందితులిద్దరితో పాటు ఆమెకు కూడా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ మేరకు ముగ్గురినీ అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ​

ఈ ఘటనపై స్పందించిన భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ ఠాకూర్‌ కమల్‌నాథ్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపు తప్పాయి. చింద్వారాకు మాత్రమే సీఎం కమల్‌నాథ్‌ పరిమితమై పోయారు. బేటీ.. నీ తరపున మేము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రఙ్ఞా.. కూతురి హత్యతో కుంగిపోయిన బాధితురాలి తల్లిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement