
జైపూర్ : గాంధీజీ కలలుగన్నట్టు మహిళలు అర్థరాత్రి నిర్భయంగా వీధుల్లో తిరగడం మాట అటుంచి.. పట్టపగలే రక్షణ లేకుండా పోతోంది. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ వివాహిత పట్టపగలు కామాంధుల అకృత్యానికి బలైంది. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఆల్వార్ జిల్లాలో గత నెల 26న చోటుచేసుకుంది. అయితే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మంగళవారం వెలుగుచూసింది.
వివరాలు.. థానాఘాజీ-ఆల్వార్ బైపాస్ మీదుగా భార్యభర్తలు వెళ్తుండగా ఐదుగురు కీచకులు అడ్డగించారు. దంపతులపై దాడిచేసి నిర్మానుష్య ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లారు. భర్త ఎదుటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా జరిగిన అకృత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మే 2నే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని చోటేలాల్, అశోక్‌గా గుర్తించామని, నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment