
ప్రతీకాత్మకచిత్రం
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. లక్నోలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలిక తన తండ్రితో పనిచేసే వ్యక్తి ఇంటిలో తీవ్రంగా గాయపడిన స్ధితిలో కనిపించింది. బాలిక తండ్రితో కలసి పనిచేసే వ్యక్తి బాధితురాలి గొంతు కోసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో విచారణ సాగుతోందని లక్నో సీనియర్ ఎస్పీ కళానిధి నైధాని తెలిపారు. తీవ్రంగా గాయపడిన స్ధితిలో కనిపించిన బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆయన చెప్పారు. బాధిత బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment