
సాక్షి, తిరుపతి: తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువతులు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతి సమీపంలోని ముళ్లపూడిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై ఇద్దరు యవకులు దారుణానికి ఒడిగట్టారు. నిందితులు రాజమోహన్, వెంకటేశ్‌లను తిరుచానురు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ ఒక వైపు ఆందోళనలు జరుగుతున్నా కామాంధులు రెచ్చిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment