tiruchanoor
-
పంచమి తీర్థానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాల కృష్ణ
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు తీర్చుకుని, ధ్వజ స్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా డిప్యూటీ ఈవో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. -
శ్రీవారు స్వయంగా ప్రతిష్టించిన ఆలయం.. అందుకే ఆ గుడి ప్రత్యేకం
సాక్షి, చిత్తూరు: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి అమ్మ వారు ఆలయంలోని ఉప దేవాలయంలో ఇది కూడా ఒకటి. అమ్మవారి దేవాలయం వెనుకభాగంలోని పుష్కరిణికి ఎదురుగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు, తిరుచానూరు అమ్మవారి దర్శించుకున్న తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సూర్య నారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచూనూరు క్ష్రేత్రం శిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహించిన పవిత్ర క్ష్రేత్రం. లక్ష్మీదేవి వ్యూగంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వేంకటేశ్వరుడు మహాలక్ష్మీ కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఆ సమయంలోలక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు. శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొనలులో ప్రతిష్టించారు. శ్రీ హరి సరస్సులో పద్మాలను నాటారు. సరస్సు తూర్పు ఒడ్డున, శ్రీ హరి సూర్యుడిని (సూర్య నారాయణ స్వామి) ప్రతిష్టించాడు. వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు. 12 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత, కార్తీక సుధ పంచమి నాడు, మహా లక్ష్మీ దేవి బంగారు పద్మం నుంచి తామరలా ప్రకాశిస్తుంది. ఆ పద్మాల వికాసానికి మూలం సూర్య కిరణాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్టించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్య నారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకానస ఆగముక్తంగా అర్చన, పూజా కార్యాక్రమాలు నిర్వహిస్తుంటారు. సూర్య నారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం ,అర్థ మండపం, గర్భాలయంగా మూడు భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉండదు. పద్మావతి అమ్మవారు, శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్య నారాయణ మూర్తి అనుసంధాన కర్తగా వ్యవహరించిన నేపధ్యంలో శ్రీనివాసుడి అవతార కధా ఘట్టంలో ఎనలేని ప్రాదాన్యత ఉంది. సూర్య నారాయణ స్వామి అభిషేక సేవలు స్వామి వారికి ప్రతి ఆదివారం పంచామ్రుత అబిషేక సేవలు నిర్వహిచండం ఆనవాయితీ. ప్రతి నెల స్వామి వారి జన్మ నక్షత్రంమైన హస్తా నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరుమాడ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రధాత అనుగ్రహం పొందుతారు. ధనుర్మాసం, రథ సప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు. ఆలయంలో పూజా, వేద మంత్రాలతో సూర్యనారాయణ స్వామికి అభిషేకం చేస్తారు. పూజ ముగింపులో, ఈ పూజలో పాల్గొనే భక్తులకు తీర్థం (స్వామి అభిషేకం సమయంలో సేకరించబడింది), ప్రసాదం, పువ్వులు ఇస్తారు. స్వామి వారికి సమర్చించిన అరటి పండ్లు, తులసి, ఆఫిల్, తదితర పండ్లను ఆలయం వెలుపలి భాగంలోని గోవులకు ఆహారంగా అందిస్తారు. ఆ ద్వారా గోమాతను పూజిస్తూ ,గోమూత్రాన్ని సేకరించి తమ ఇంట్లో చల్లుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం . సూర్యనారాయణ స్వామి అభిషేకంతో ప్రయోజనాలు ►కుటుంబ శ్రేయస్సు కోసం, ప్రశాంతమైన మనస్సు, సూర్యుని గ్రహ స్థానం బలాన్ని మెరుగుపరచడానికి. ►వివాహం ఆలస్యం అవుతోంది అన్న భావన కలిగిన భక్తులు స్వామికి అభిషేకం చేయిస్తే వివాహాది కార్యాలు త్వరితగతిన అవుతాయి. ►జంటలు పిల్లలకు ఈ పూజ చేస్తారు. పెళ్లి అయిన స్త్రీలకు త్వరగా గర్బధారణ అవుతుందని భక్తుల విశ్వాసం. ►ఉద్యోగ,వ్యాపారం,ఆస్తుల క్రయ,విక్రయాల్లో అభివృద్ది కోసం వ్యక్తులు ఈ పూజ చేస్తారు. చదవండి: Nagari Hills: నగరికి ఆ పేరు.. దీని వెనుక ఇంత కథ ఉందా! -
తిరుపతిలో బాలికపై లైంగిక దాడి
సాక్షి, తిరుపతి: తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువతులు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతి సమీపంలోని ముళ్లపూడిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై ఇద్దరు యవకులు దారుణానికి ఒడిగట్టారు. నిందితులు రాజమోహన్, వెంకటేశ్‌లను తిరుచానురు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ ఒక వైపు ఆందోళనలు జరుగుతున్నా కామాంధులు రెచ్చిపోతున్నారు. -
అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ ఆభరణాలు
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనంపై పద్మావతి అమ్మవారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజూ మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో అమ్మవారికి అలంకరించేందుకు ఏడురకాల మాలలు, కిరీటం, కుచ్చు జడను వినియోగిస్తారు. మామూలుకు భిన్నంగా అమ్మవారి అలంకరణార్థం తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌కు చెందిన రాజేందర్ అనే భక్తుడు బాదం పప్పు, వట్టి, కురు వేర్లు, రోస్ పెటల్స్, సంపంగిని ఉపయోగించి మాలలు, కిరీటం, కుచ్చు జడను తయారుచేయించారు. వీటిని బుధవారం టీటీడీ ఉద్యానవనశాఖ డిప్యుటీ డెరైక్టర్ శ్రీనివాసులకు అందజేశారు. వీటిని అమ్మవారికి స్నపన తిరుమంజనంలో అలంకరించారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు దాత సహకారంతో వైవిధ్య మాలలు, కిరీటం, కుచ్చు జడను ఆలయ అర్చకులకు అందించనున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. అలాగే తిరుమంజనంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు న్యూజిలాండ్ కివీ ఫ్రూట్స్, ఆస్ట్రేలియా ఆరెంజ్, అమెరికన్ గ్రేప్స్, డేట్స్ తదితర పండ్లను దాత అందించినట్లు తెలిపారు. -
తిరుచానూరులో ప్రసాదాల కుంభకోణం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల కుంభకోణం కలకలం రేపింది. దీనిపై విజిలెన్స్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అయితే అధికారుల ఒత్తిడి కారణంగా రహస్య విచారణ కొనసాగిస్తుందని తెలుస్తుంది. బ్రహోత్సవాల్లో తయారు చేసిన జిలేబీ ప్రసాదాన్ని పెద్ద ఎత్తున ఆలయ ఉద్యోగి పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆలయ సూపరింటెండెంట్‌తో పాటు ఓ ఇన్స్పెక్టర్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది. ఉద్యోగుల పేరుతో ప్రసాదాన్ని విక్రయిస్తున్న దళారిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ప్రసాదాల కుంభకోణంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
తిరుచానూరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకోనున్న ప్రణబ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా ప్రణబ్ పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం రెండో ఘాట్ మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. ఆయన మధ్యాహ్నాం స్వామివారి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం వరకు ప్రణబ్ తిరుమలలో గడపనున్నారు. రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ తిరుమలకు రావడం ఇది మూడోసారి. రాష్ట్రపతి వెంట ఆయన కుమారుడు, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు తిరుమల రానున్నారు. రాష్ట్రపతి రాకతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఇప్పటికే భద్రతా బలగాలు తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత సర్వదర్శనాన్ని కూడా నిలిపివేయనున్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
-
లక్ష్మీప్రియ మృతదేహం వెలికితీత
తిరుమల : చిత్తూరు జిల్లా తిరుచానూరు ఈతమాకుల వీధిలో మేనమమ చేతిలో దారుణహత్యకు గురైన చిన్నారి లక్ష్మీప్రియ మృతదేహాన్ని పోలీసులు మంగళవారం బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డబ్బులు కారణంగానే లక్ష్మీప్రియను హతమార్చడటం దారుణమని, ఇంకా రెండింతలు డబ్బులు ఇస్తామని.. తమ చిన్నారిని ప్రాణాలతో తిరిగి తెచ్చివ్వమంటూ అర్థిస్తున్నారు. కాగా లక్ష్మీప్రియను దారుణంగా హతమార్చిన శ్రీనివాసులు రెడ్డిని వెంటనే ఉరేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
లక్ష్మీప్రియను హతమార్చింది మేనమామే..
*ఐదేళ్ల చిన్నారి హత్య *తిరుచానూరులో విషాదం *పోలీస్‌స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన అభం శుభం తెలియని ఆ చిన్నారి పాలిట మామే కాలయముడయ్యాడు. మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని కానరాని లోకాలకు పంపాడు. కర్కశంగా నీళ్లలో ముంచేసి ప్రాణాలు తీసేశాడు. ఈ ఘటన సోమవారం తిరుచానూరులో కలకలాన్ని సృష్టించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. బంగారంలాంటి బిడ్డ ప్రాణాలు తీసిన రాక్షసుడ్ని చంపేయాలంటూ ఆందోళనకు దిగారు.. తిరుచానూరు: ఐదేళ్ల చిన్నారి లక్ష్మీప్రియను వరుసకు మేనమామ హత్య చేయడం తిరుచానూరులో విషాదం నెలకొంది. తిరుచానూరు ఈతమాకుల వీధిలో నివాసముంటున్న పెంచల్‌రెడ్డి, మల్లీశ్వరి దంపతులకు లక్ష్మీప్రియ(5) ఒక్కటే కుమార్తె. స్థానిక వైష్ణవి విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. ప్రతి రోజులానే సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్కూల్ వ్యానులో నుంచి లక్ష్మీప్రియతో పాటు ఇద్దరు పిల్లలు ఇంటి సమీపంలోని రేణిగుంట రోడ్డులో దిగారు. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి అమ్మ భజనగుడివీధిలోని పెద్దమ్మ ఇంట్లో ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని అక్కడున్న వారు మల్లీశ్వరికి చెప్పారు. పాపను తీసుకెళ్లిన వ్యక్తి దాదాపు నలభై ఏళ్ల వయసు కలిగి, నల్లగా, పొట్టిగా ఉన్నాడని, ఎరుపు రంగు టీషర్టు ధరించి ఉన్నాడని పాపతో పాటు బస్సు దిగిన లక్ష్మీప్రియ అక్క కొడుకులు జయసూర్య, యోగానంద తెలిపారు. దీంతో పాపానాయుడుపేటలోని వరుసకు అన్న అయిన శ్రీనివాసులురెడ్డే పాపను తీసుకెళ్లాడని మల్లీశ్వరి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుటాహుటిన ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ సురేంద్రనాయుడు, ఎస్ఐలు మల్లేష్‌యాదవ్, చిరంజీవి, చిన్నారులు జయసూర్య, యోగానందను వెంటబెట్టుకుని పాపానాయుడుపేటకు వెళ్లారు. మార్గమధ్యంలో వికృతమాలకు వెళ్లేదారి వద్ద శ్రీనివాసులు రెడ్డి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ వెనుక వికృతమాల గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న నీటి గుంతలో పాపను ముంచి హత్య చేసి, గుంత తీసి పూడ్చిపెట్టినట్టు అతను అంగీకరించాడు. అప్పటికే చీకటి కావడంతో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని వెలికి తీయనున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన సోమవారం రాత్రి లక్ష్మీప్రియ హత్య వార్త వెలుగు చూడ్డంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడుని చంపేయాలని డిమాండ్ చేశారు. లేదా నిందితుడి కాళ్లు చేతులు తీసేయాలని, మరొకరు ఇలాంటి దారుణానికి పాల్పడకుండా ఉంటారని చెప్పారు. నిందితుడిని తమకు అప్పగించాల్సిందే అని పట్టుబట్టారు. డీఎస్పీ సర్ది చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. డబ్బు తగాదాలే హత్యకు కారణం..? చిన్నారి హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గతంలో లక్ష్మీప్రియ నాన్న పెంచల్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. -
శ్రీవారి పట్టపురాణి
తిరుచానూరు: కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం రాత్రి పద్మావతీ అమ్మవారు అశ్వవాహనంపై కల్కి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7.05 గంటలకు అమ్మవారికి వేడుకగా రథోత్సవం, మధ్యాహ్నం ఒంటి గం టకు రథమండపంలో నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించారు. తరువాత అమ్మవారిని వాహన మండపానికి తీసుకొచ్చి అశ్వవాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని కల్కి భగవానుడిగా అలంకరిం చారు. రాత్రి ఎనిమిది గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ ప్రవచనం, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారు అశ్వవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ. గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, వీజీవో రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.