
నవనీత, మోక్ష (ఫైల్)
కాచిగూడ: పానీపూరీ తినేందుకు బయటికి వెళ్లిన తల్లి, కూతురు అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్‌పెక్టర్ ఎస్.జానకీరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లకుంట డివిజన్ వెంకటేశ్వరనగర్ ప్రాంతానికి చెందిన త్రివేద్ భార్య నవనీత, కుమార్తె మోక్షతో కలిసి ఈ నెల 8న సాయంత్రం పానీపూరీ తినేందుకు బయటికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసినవారి ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో నవనీత తండ్రి సుధాకర్ మంగళవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధర్మ తెలిపారు.