
బనశంకరి : సిలికాన్‌సిటీలో ఆన్‌లైన్ వంచకుల మోసాలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్‌రోగ నివారణకు తక్కువ ధరతో హెర్బల్‌సీడ్స్ అందిస్తామని చెప్పి ఓ పారిశ్రామికవేత్తను నైజీరియన్లు మోసగించిన సంఘటనన శుక్రవారం వెలుగుచూసింది. నగరానికి చెందిన పారిశ్రామికవేత్త రవికుమార్‌కు క్యాన్సర్ రోగానికి హెర్బల్‌సీడ్స్ అందిస్తామని చెప్పి నైజీరియాకు చెందిన కొందరు ఫోన్‌లో సంప్రదించారు. వీరి మాటలు నమ్మిన రవికుమార్ వారి సూచన మేరకు రూ. 20 లక్షల నగదు వారి ఖాతాకు జమచేయించుకున్నారు. అనంతరం హెర్బల్ సీడ్స్ అందకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన శుక్రవారం రవికుమార్ సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.