హైదరాబాద్: చాక్‌లెట్లు, మిఠాయిలపై ఉండే కవర్లలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి చాక్‌లెట్లు, మిఠాయిల కవర్లపై బంగారంతో చేసిన కవర్లతో పాటు ఓ ఫొటోఫ్రేమ్‌కు ఉన్న రేకును బాక్స్‌లో పెట్టి తీసుకొచ్చాడు.
శనివారం ఉదయం కస్టమ్స్ అధికారుల తనిఖీలను గమనించిన అతడు..బాక్స్‌ని విమానాశ్రయంలోనే వదిలి పరారయ్యాడు. తనిఖీల్లో దాదాపు రూ. 19 లక్షలు విలువైన 585.64 గ్రాముల బంగారాన్ని స్వా«ధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment