
బస్సు వద్ద తిరుగుతున్న నిందితుడు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు ప్రాంతా ల్లో సెల్‌ఫోన్‌లను చోరీ చేసిన దొంగ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు వారి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను అతను ఎంతో చాకచాక్యంగా కొట్టేస్తాడు. కొన్ని రోజుల క్రితం సెల్‌ఫోన్ దొంగలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. త్రీ టౌన్ సీఐ జయానాయక్, ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్ అతని ఫొటోలను పత్రికలకు విడుదల చేశారు. ఈ వ్యక్తి ఎక్కడైనా తారస పడితే 912100589, 9121100592 అనే నంబర్లకు ఫోన్ చేయాలని సీఐ, ఎస్‌ఐ కోరారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment