![Police Raids On Rave Party In Rampachodavaram - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/8/rave-party.jpg.webp?itok=rUQH49cV)
పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళలు
సాక్షి, రంపచోడవరం: రేవ్ పార్టీల సంస్కృతి నగరాల నుంచి పల్లెలకు విస్తరిస్తోంది. మద్యం మత్తులో విశృంఖల కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వరకు తాగితందనాలాడుతూ అనైతిక చర్యలకు దిగుతున్నారు. పోలీసులకు కళ్లుగప్పి గుట్టుగా సాగిస్తున్న రేవ్ పార్టీల వల్ల సామాజికంగా, శాంతిభద్రతల పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దేవరాతిగూడెం వద్ద ఏవన్ రిసార్ట్‌లో శుక్రవారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏడుగురు మహిళలు, 20 మంది పురుషులు, నిర్వాహకుడు రమణ మహర్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలం నుంచి ఐదు కార్లతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై కూపీ లాగుతున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న పురుషులు
Comments
Please login to add a commentAdd a comment