
ప్రసన్న (ఫైల్)
ఉప్పల్: ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ దేవేందర్ నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవేందర్‌నగర్ ప్రాంతానికి చెందిన సత్తయ్య కుమార్తె ప్రసన్న, అదే ప్రాంతంలో ఉంటున్న అనంతపురం జిల్లాకు చెందిన రియాజ్ పాషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్బిణి. ఆదివారం రియాజ్ ప్రసన్నను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. సోమవారం సాయంత్రం ఆమె తన ఇంటి రెండో అంతస్తులోకి వెళ్లి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పూజారి బలవన్మరణం
మల్కాజిగిరి: ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విష్ణుపురి కాలనీకి చెందిన ఎల్లాప్రగడ సాయిదత్తు(25) పూజారిగా పని చేసేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఎల్లాప్రగడ నాగేశ్వరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.