
ములుగు రూరల్: రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న ఓ వృద్ధుడు సైకో చేతిలో హత్యకు గురయ్యాడు. ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారం–అబ్బాపురం రహదారిలో మంగళవారం జరిగింది. జాకారం గ్రామానికి చెందిన సామంతుల రాజు భార్య వారం రోజుల క్రితం భర్తతో గొడవ పడి రేగొండ మండలం కొప్పులలోని పుట్టింటికి వెళ్లింది. ఆమెను ఇంటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో మంగళవారం అత్తగారి ఊరికి బయల్దేరాడు.
అదే సమయంలో ఇదే మండలం అబ్బాపురం గ్రామానికి చెందిన కొంగొండ నర్సయ్య (75) జాకారం మీదుగా ములుగుకు వస్తున్నాడు. ఈ క్రమంలో జాకారం–అబ్బాపురం మార్గంలో అతడికి నర్సయ్య ఎదురుపడగానే మతిస్థిమితం కోల్పోయి దాడి చేయడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత అతడు డీఆర్‌డీఏ శిక్షణా శిబిరంపై దాడికి పాల్పడ్డాడు. శిబిరంలో ఉన్న యువతులపై రాళ్లు విసరడంతో వారు పోలీసులకు సమాచారమివ్వగా వారు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment