ప్రతీకాత్మక చిత్రం
పుణె : తనను ఏ మాత్రం పట్టించుకోకుండా పాకిస్తాన్‌కు చెందిన సీరియల్స్ చూస్తుందని ఓ 40 ఏళ్ల వ్యక్తి తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన పుణెలోని సాలిస్‌బరిలో గత సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోర్డింగ్స్ వ్యాపారం చేసే ఆసీఫ్ సత్తార్ నయాబ్, తన భార్యా పిల్లలతో కలసి సాలిస్‌బరిలో నివసిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం పాల ప్యాకెట్ విషయంలో సత్తార్ నయాబ్‌కు అతని భార్యకు చిన్నపాటి గొడవ జరిగింది.
లీకైన పాల ప్యాకెట్ తెచ్చాడని కొడుకుపై అరుస్తున్న తన భార్యను నయాబ్ మందలించాడు. ఈ క్రమంలో మాటకు మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం నయాబ్ తన పనికి వెళ్లాడు. సాయంత్రం తిరొగిచ్చిన తర్వాత అతని భార్య ఎంతకు మాట్లాడలేదు. పైగా బెడ్ రూంలోకి వెళ్లి అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మొబైల్‌లో పాకిస్తాన్ సీరియల్ చూస్తు ఉండిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నయాబ్ పక్కనే ఉన్న రాడ్‌తో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కుడిచేతి బొటనవేలు విరిగిపోయింది. వెంటనే ఆమె.. తన భర్త తనను చంపడానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment