
చోరీ జరిగిన గదిని పరిశీలిస్తున్న ఎస్సైలు పీవీఆర్ మూర్తి, ప్రశాంతి
పిఠాపురం రూరల్: పిఠాపురం మండలం జల్లూరులో ఓ పెళ్లి ఇంట చోరీ జరిగింది. బీరువాను పగలకొట్టి రూ.రెండు లక్షల నగదు, బంగారు, వెండి వస్తువులు అపహరించుకుపోయినట్టు బాధితులు చెప్పారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రోడ్డులో జల్లూరు రామాలయం సమీపంలో నివసిస్తున్న బత్తిన సూరిబాబు మేనకోడలు వివాహం నిమిత్తం కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి అన్నవరం వెళ్లారు. పెళ్లి ముగించుకుని ఉదయం ఇంటికి చేరుకునే సరికి ఇంటి రెండు గదుల తలుపులు తెరిచి, బీరువాలు పగలకొట్టి చోరీ చేసినట్టుగా గుర్తించారు. ఈ మేరకు పిఠాపురం రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై పీవీఆర్ మూర్తి, కూŠల్స్ టీమ్ ఎస్సై ప్రశాంతి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. బీరువాల్లోని రూ.రెండు లక్షల నగదు, 12 తులాల వెండి వస్తువులు, కాసున్నర బంగారపు వస్తువులు చోరీకి గురైనట్టు సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment