కామారెడ్డి క్రైం : ఆమె పేరు శైలజ.. రామారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం తాడ్వాయిలోని కేజీబీవీలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది.. ఇటీవల ఎస్పీ శ్వేత ఈ శిబిరాన్ని సందర్శించారు. విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. భవిష్యత్‌లో మీరేం కావాలనుకుంటున్నారు అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కావాలనుకుంటున్నానని శైలజ పేర్కొంది. ఒకరోజు ఎస్పీగా వ్యవహరించాలన్నది తన కోరికని చెప్పింది..
ఆ విద్యార్థిని కల శుక్రవారం నెరవేరింది. ఎస్పీ అనుమతితో శైలజ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయానికి యూనిఫాంలో వచ్చి, ఒకరోజు ఎస్పీగా విధులు నిర్వహించింది. రిజర్వు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌వో రాణి, పోలీస్ బృందం ఆమెకు సహకరించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఎస్పీ మేడమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని, బాగా చదివి ఎస్పీ అవుతానంది. ఎస్పీ అయ్యాక మొదట శ్వేత మేడమ్‌నే కలుస్తానని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment