సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
నిర్మల్‌టౌన్: ప్రమాదాల నివారణకు పడక్బందీగా చర్యలు తీసుకోవాని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రైవేట్ వాహనాల ఓవర్ లోడింగ్‌తో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఓవర్‌లోడింగ్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్య తీసుకోవాలన్నారు.
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణించకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీ బస్టాండ్‌కు 200 గజాల దూరంలో ఉంచేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆటోల ఆగడాలను నియంత్రించేందుకు ఆర్టీసీ, పోలీసు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు.
ఎస్పీ శశిధర్‌రాజు, జిల్లా రవాణా అధికారి అజయ్‌కుమార్‌రెడ్డి, ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డివిజనల్ మేనేజర్ రమేశ్, డీఎం గడ్డం సతీశ్‌చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశాంతి
Comments
Please login to add a commentAdd a comment