కోచింగ్‌ క్లాస్‌కు వెళుతుండగా.. | Student Abducted And Gangraped In Agra | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ క్లాస్‌కు వెళుతుండగా..

Published Wed, Dec 19 2018 11:08 AM | Last Updated on Wed, Dec 19 2018 1:00 PM

Student Abducted And Gangraped In Agra - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లో బాలికలు, మహిళలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్‌ పడటం లేదు. ఆగ్రాలో కోచింగ్‌ క్లాస్‌కు వెళుతున్న బాలికను అడ్డగించి యుమున నది కరకట్టపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.

కోచింగ్‌ క్లాస్‌కు వెళుతుండగా తనను అపహరించిన నిందితుడితో సహా నిర్మానుష్య ప్రదేశంలో అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు వెల్లడించారు.

బాలిక తలపై గాయాల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆగ్రాలోని ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. బాధితురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement