
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఆగిరిపల్లి ఎస్వీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి లీలా ప్రసాద్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్కూల్ బయటకు వచ్చిన బాలికను బైక్‌పై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.