మైలార్‌దేవ్‌పల్లి: గంటల కొద్ది స్మార్ట్‌ఫోన్ వాడుతున్న తమ్ము డిని అన్న మందలించ డంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన çఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురు వారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. టీఎన్‌జీఓ కాలనీలో ఉంటున్న అంకిత్‌కుమార్ తమ్ముడు నితీష్‌కుమార్ స్థానిక ఓ ప్రైవే టు పాఠశాలలో పదో తరగతి పూర్తిచేశాడు. ఈ నెల 14న గంటల కొద్ది స్మార్ట్‌ఫోన్ చూడొద్దని అన్న మందలించటంతో మధ్యాహ్నం 2.30 గంటలకు ఫోన్ తన చెల్లెకు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని ఆమెకు చెప్పాడు. అన్న అంకిత్‌కుమార్ సాయంత్రం 5 గంటలకు వచ్చి చూడగా తమ్ముడు నితీష్ ఇంట్లో కనిపించలేదు. సాయంత్రం 7 గంటలకు అతని పెద్ద చెల్లెలు పద్మ ఇప్పటి వరకు తమ్ముడు ఇంటికి రాలేదని అన్నకు విషయం చెప్పింది. అన్ని చోట్ల వెతికినా, స్వస్థలం బిహార్‌కు ఫోన్ చేసి వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment