బాధితుడు సుదర్శన్‌రావు
కామారెడ్డి క్రైం: సీఐడీ పోలీసులమని చెప్పి ఓ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి, అతని నుంచి బంగారు ఉంగరం, గొలుసు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో గురువారం కేసు నమోదు చేశారు.
పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పట్టణానికి చెందిన సుదర్శన్‌రావు నిజాంసాగర్ చౌరస్తాలోని ఓ వస్త్ర దుకాణం వద్దకు షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడున్న ఇద్దరు వ్యక్తులు అతడిని అటకాయించి, తాము సీఐడీ అధికారులమని పరిచయం చేసుకున్నారు.
పక్కకు తీసుకువెళ్లి, మత్తుమందు చల్లిన కర్చీఫ్‌ను అతడి ముఖానికి పెట్టడంతో సుదర్శన్‌రావు మత్తులోకి జారుకున్నారు. స్పృహా కోల్పోవడంతో దుండగులు అతడి ఒంటిపై ఉన్న గొలుసు, ఉంగ రం దోచుకొని పరారయ్యారు. షాక్ నుంచి కోలు కున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వా రు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment