మాట్లాడుతున్న డీఎస్పీ భద్రయ్య
జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల డీఎస్పీ భద్రయ్య అన్నారు. శుక్రవారం పట్టణపోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు పంచలోహ విగ్రహాల దొంగలను అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెం దిన వడ్లూరి నాగరాజు, జగిత్యాల గాంధీనగర్‌కు చెందిన మహబూబ్, ధరూర్‌కు చెందిన గడ్డం ప్రసాద్ పాతనేరస్తులు. జైలులో పరిచయమై స్నేహితులుగా మారారు.
ఈనెల 22న వడ్లూరి నాగరాజు వేములవాడలో ద్విచక్రవాహనం చోరీ చేశాడు. అక్కడి నుంచి జగిత్యాలకు వచ్చి మహబూబ్‌ను కలిశాడు. ఈ నెల 23న కొడిమ్యాల మండలం నల్లగొండ నృసింహుడి ఆలయ తాళాలు పగులగొట్టి స్వామివారి కోరమీసాలు, రెండు చైన్‌లు, ఇత్తడి గంటలు, దీపాంతాలు చోరీ చేశారు. అదేరోజు జగిత్యాలకు వచ్చి గడ్డం రమేష్‌ను కలిశారు. ముగ్గురు కలిసి రాంబజార్‌లో ఓ ద్విచక్రవాహనం చోరీ చేశారు. రాత్రి కోరుట్లకు వెళ్లి సాయిరాంపురాలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు దొంగిలించారు. శుక్రవారం పట్టణశివారులోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ ప్రకాష్, ఎస్సై ప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment