
సాక్షి, భువనేశ్వర్ : సోషల్ మీడియాలో వేలం వెర్రిగా మారిన టిక్ టాక్ వీడియోలకు సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఒడిశాలోని ఒక ఆసుపత్రిలోని నర్సుల టిక్‌టాక్ వీడియో ఒకటి వైరల్ అయింది.
మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో నవజాత శిశువుల వార్డులో పనిచేసే కొంతమంది నర్సులు ఈ వీడియోను తీశారు. నర్సింగ్ డ్రెస్‌లో బాలీవుడ్ పాటలకు పదం కదుపుతూ ఫన్నీ డైలాగ్‌ల పెదాలు కలుపుతూ ముచ్చట తీర్చుకున్నారు. కానీ అదే వారికి ఉద్యోగాలకు ముప్పు తేనుంది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ముఖ్య వైద్య అధికారి (సిడిఎంఓ) ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే సదరు నర్సులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నామని ఆసుపత్రి ఇన్‌చార్జ్ తపన్ కుమార్ వెల్లడించారు.