ఇద్దర్ని కాల్చిచంపిన పోలీస్‌ కానిస్టేబుల్‌‌ | Two Brothers Shot Dead By Police Constable Over A Land Issue | Sakshi
Sakshi News home page

స్థల వివాదం: ఇద్దర్ని కాల్చిచంపిన కానిస్టేబుల్‌

Published Sun, May 17 2020 2:50 PM | Last Updated on Sun, May 17 2020 3:02 PM

Two Brothers Shot Dead By Police Constable Over A Land Issue - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : స్థల వివాదం కారణంగా ఇద్దరు అన్నదమ్ములను కాల్చి చంపాడో పోలీస్‌ కానిస్టేబుల్‌. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పరగనాస్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పరగనాస్‌ జిల్లా అమ్‌దంగ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టిటులియాకు చెందిన ఆరుప్‌ మండల్‌, సుమంత మండల్‌ అనే ఇద్దరు అన్నదమ్ములకు ఓ స్థలం విషయంలో అదే ప్రాంతానికి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌తో గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సదరు పోలీస్‌ కానిస్టేబుల్‌ అన్నదమ్ములపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో అ‍న్నదమ్ములిద్దరూ మృత్యువాత పడగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దీనిపై శనివారం కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చదవండి : కంటిపాపకు తెలియకుండా కాటికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement